పది ఫెయిల్.. కేక్ కట్ చేయించిన తల్లిదండ్రులు

పది ఫెయిల్.. కేక్ కట్ చేయించిన తల్లిదండ్రులు

పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడని కొడుకును అందరూ ఎగతాళి చేస్తుంటే.. బాగల్‌కోట్‌లోని తల్లిదండ్రులు కేక్ కట్ చేయించి మనోధైర్యాన్ని ఇచ్చారు. 600కి 200 మార్కులు తెచ్చుకున్న అభిషేక్‌కు తల్లిదండ్రులు ధైర్యం చెప్తూ.. ఓడిపోయింది పరీక్షల్లోనే, జీవితంలో కాదన్నారు. అందుకు బదులిస్తూ మళ్లీ పరీక్ష రాసి పాస్ అవుతానని కొడుకు భరోసానిస్తూ.. కుటుంబ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపాడు.