సూళ్లూరుపేటలో వరద స్థాయిని పరిశీలించిన సీఐ

సూళ్లూరుపేటలో వరద స్థాయిని పరిశీలించిన సీఐ

TPT: దిత్వా తుఫాన్ ప్రభావంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఐ మురళీ కృష్ణ ఆదివారం ఉదయం అధికారులతో కలిసి దొండకాలువ వద్ద వరద స్థాయిని పరిశీలించారు. ప్రస్తుతం ప్రాంతంలో పరిస్థితి సాధారణంగా ఉందని, సూళ్లూరుపేట-మంగళంపాడు రోడ్పై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేదని, కాళంగి నది వద్ద కూడా ప్రమాద సూచనలు లేవని ఆయన తెలిపారు.