రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి

ఏలూరులో గుర్తుతెలియని వ్యక్తి రైలు నుండి జారిపడి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈస్ట్ కోస్ట్ రైలు నుండి గిలకలపేట గేటు సమీపంలో జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వాళ్ళు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సంప్రదించాలని సూచించారు.