పురుగుమందు తాగిన మరో RTC డ్రైవర్
వరంగల్ రీజియన్ పరిధిలోని భూపాలపల్లి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వంగపాడు గ్రామానికి చెందిన ఆయన నిన్న రాత్రి పురుగుమందు తాగారు. కాగా, అతడిని ఎంజీఎంకు తరలించారు. కుటుంబ కలహాలతో పురుగుమందు తాగినట్లు సమాచారం. నిన్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.