నీటి పన్ను చెల్లించని వారికి నీటి సరఫరా నిలిపివేత
VZM: రాజాం మున్సిపాలిటీ పరిధిలో కొళాయి పన్ను బకాయిలు పెరిగిపోయాయని మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదేశాలతో సోమవారం బొబ్బిలి రోడ్డులో పన్ను చెల్లించని రెండు ఇళ్లకు సచివాలయ సిబ్బంది నీటి సరఫరా కనెక్షన్లు కట్ చేసి డమ్మీలు వేశారు. నీటి పన్ను చెల్లించాలంటూ మున్సిపల్ సిబ్బంది చెప్తున్నా, స్పందన రాకపోవడంతో చర్యలకు ఉపక్రమించామన్నారు.