కృష్ణానదిలో దూకి మహిళ ఆత్మహత్య

కృష్ణానదిలో దూకి మహిళ ఆత్మహత్య

NTR: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ బ్యారేజ్‌పై నుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని మహాలక్ష్మి (45)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.