పులస కనుమరుగు.. విలసలకు డిమాండ్

కోనసీమ: జిల్లాలో పులస చేపల లభ్యత లేకపోవడంతో పులస ప్రియులు నిరాశ చెందుతున్నారు. వరదల సమయంలో గోదావరి నదిలోకి వచ్చే పులస జాడ లేకపోవడంతో, దాని స్థానంలో పులసను పోలి ఉండే విలస చేపలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం సముద్రంలో దొరికే విలసల ధర కిలో రూ.700 నుంచి రూ.1500 వరకు పలుకుతోంది. పులస లేని లోటును తీర్చడానికి ప్రజలు విలసలను కొనుగోలు చేస్తున్నారు.