'యువత మత్తుకు దూరంగా ఉండాలి'
అన్నమయ్య: గంజాయి నిర్మూలనే లక్ష్యంగా 'వజ్ర ప్రహర్' కార్యక్రమంలో భాగంగా శనివారం ఓబుళవారిపల్లి మండలం మంగంపేటలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్ నేతృత్వంలో అనుమానిత ఇళ్లు, వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, దీనిపై సమాచారం ఉంటే డయల్ 100కు తెలపాలని ఎస్సై మహేష్ నాయుడు కోరారు.