VIDEO: లిక్కర్ కేసులో నిందితులను అరెస్టు చేయాలి: బీజేపీ
కోనసీమ: గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీలో జరిగిన భారీ ఆర్థిక కుంభకోణంలో నిందితులను వెంటనే అరెస్టు చేసి, పూర్తి దర్యాప్తు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ అమలాపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌లో జేసీ నిశాంతికి ఫిర్యాదు పత్రం అందజేశారు.