చీరలు కట్టుకున్న మొక్కలు

అల్లూరి: సాధారణంగా రైతులు తాము నాటిన మొక్కలకు రక్షణగా కంచెలు ఏర్పాటు చేస్తారు. కానీ, జీకేవీధి మండలానికి చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించి మొక్కల చుట్టూ చీరలు చుట్టారు. కడుగుల గ్రామానికి చెందిన వీ.బుజ్జిబాబు అనే రైతు తన పోడుభూమిలో సిల్వర్ మొక్కలు నాటారు. అయితే వాటిని పశువులు, జంతువులు తినకుండా రక్షించేందుకు గాను మొక్కల చుట్టూ కర్రలు పాతి వాటికి చీరలు చుట్టారు