లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం: పెమ్మసాని
GNTR: ఈ ఏడాది లక్ష మంది యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుర్రిపాలెంలో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 105మందికి ఎమ్మెల్సీ ఆలపాటితో కలిసి ఆయన ఉద్యోగ నియామక, ధ్రువపత్రాలు అందజేశారు. ఒక్కో విద్యార్థిపై రూ.72 వేలు ఖర్చు చేసి ఈ శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.