అల్లూరికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ

VSP: జిల్లాలోని భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి గురువారం ఘనంగా జరిగింది. అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి అల్లూరి చేసిన సేవలను కొనియాడారు.