VIDEO: గోదావరికి వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

KMM: భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. రాత్రి 10 గంటలకు 48 అడుకులుగా ఉన్న నీటిమట్టం.. గురువారం ఉదయం 50.3 అడుగులకు చేరింది. ఇప్పటికే సీడబ్ల్యూసీ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 11,50,568 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న భారీ వరదకు నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.