మహిళా పోలీస్ కానిస్టేబుల్‌కు ఘన సత్కారం
GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మహిళా సిబ్బందిని గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సింగయ్య మాట్లాడుతూ, మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను కుటుంబ సభ్యురాలిగా భావించి సత్కరించడం తమకు గొప్ప గౌరవంగా భావిస్తున్నామని పోలీస్ శాఖలో మహిళా పోలీస్ పాత్ర కీలకమైనదని తెలిపారు.