'ఉపాధి కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు'

'ఉపాధి కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు'

ASR: డుంబ్రిగూడ మండలం చాపరాయి జలవిహారిలో స్థానికులకు ఉపాధి కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అభివృద్ధి సొసైటీ కోశాధికారి ఎం. అరుణ్ రాజ్ ఆరోపించారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని, పదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని పంచాయతీ తీర్మానం చేసినా, ఐదుగురికే అవకాశం కల్పించి మిగిలిన వారికి అన్యాయం చేశారని ఆయన తెలిపారు.