గంజాయి తరలిస్తున్న యువకుడు అరెస్ట్
ASR: జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ వద్ద రూ.3 లక్షల విలువైన 6 కిలోల గంజాయిని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి కర్నూలుకు తరలిస్తున్న పి. జగన్నాథ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. నిందితుడిని రంపచోడవరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.