మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికిన డాక్టర్ రాజయ్య

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఘన స్వాగతం పలికారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంద కృష్ణ మాదిగతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. మంద కృష్ణ పోరాటానికి మద్దతు ఉంటుందని రాజయ్య ప్రకటించారు.