వేములూరి కెనాల్ కి గండి... వర్ధాపురంలో పంటకు తీవ్ర నష్టం

వేములూరి కెనాల్ కి గండి... వర్ధాపురంలో పంటకు తీవ్ర నష్టం

SRPT: మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ వేమూలూరు ప్రాజెక్ట్ కు వరద ఉధృతి పెరిగింది. దీంతో కెనాల్ కింద వరదాపురం గ్రామంలో గండి పడింది. నీటి ప్రవాహం పెరిగి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. పంట నష్టాన్ని తగ్గించేందుకు గ్రామస్తులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకొని గండిని మరమ్మతు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.