కొండగట్టు హనుమాన్ జయంతికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కొండగట్టు హనుమాన్ జయంతికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

జగిత్యాల: ఈ నెల 22 నుండి 24 వరకు కొండగట్టులో జరిగే శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. త్రాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.