BREAKING: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు
HYD: మేడ్చల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఒకేసారి కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్‌తో పాటు పలు రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అటు డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆఫీస్ అధికారులు, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా సోదాలు చేస్తున్నారు.