నిద్ర లేవగానే కాఫీ తాగుతున్నారా?
చాలా మందికి నిద్రలేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ రెండూ పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ.. పరగడపున తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగితే హార్మోన్లపై, కడుపులోని మంచి బ్యాక్టీరియాపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. బదులుగా ఉ.9-11 గంటల మధ్యలో తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదంటున్నారు.