ప్రకాశం బ్యారేజీ వరద అప్‌డేట్

ప్రకాశం బ్యారేజీ వరద అప్‌డేట్

GNTR: ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,68,981 క్యూసెక్కులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నందున వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.