తాడిచెట్టు నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
JN: పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు యాదగిరి గౌడ్ సోమవారం కులవృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి క్రింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఛాతీ భాగం, వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.