ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ
KMR: బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ విఠల్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు తమ గ్రామాన్ని అభివృద్ధి చేసే సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. మద్యం, డబ్బుల ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా రూ. 50 వేలకు పైగా నగదును వెంట తీసుకురావద్దని ఆయన తెలిపారు.