ఈనెల 26 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు
MNCL: ఈ నెల 26, 27, 28 తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు DEO యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలతో అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రోత్సహిస్తూ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే దీని ఉద్దేశం అన్నారు. మంచిర్యాల CCC ఆక్స్‌ఫర్డ్ స్కూల్లో నిర్వహించే ప్రదర్శనలకు విద్యార్థులు తమ ప్రాజెక్టుతో పాటు గైడ్ టీచర్‌తో హాజరవ్వాలన్నారు.