ఈ నెల 14న సీఐఐ సమ్మిట్: లోకేష్
AP: ఈ నెల 14, 15న విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. 'ఈ సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఈ సదస్సులో 410కు పైగా ఒప్పందాలు జరగనున్నాయి. సీఐఐ సమ్మిట్‌లో ఒప్పందాలు విలువ రూ.2 లక్షల కోట్లకుపైగా ఉంటుంది. ఈ ఒప్పందాలతో 9 లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించనున్నాం.