'విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: విద్యార్థులు గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కలెక్టర్ కోయ బి హర్ష సూచించారు. పెద్దపల్లి గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ఆయన అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుకు అనుకూల వాతావరణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.