ఎమ్మెల్యేను కలిసిన ఎస్టీ కమిషన్ సభ్యురాలు

ELR: జీలిగుమిల్లీ(m) బర్రింకలపాడులో ఉన్న పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎస్టీ కమిషన్ సభ్యురాలు తాటి లక్ష్మి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ను కలిశారు.గిరిజన సమాజ అభ్యున్నతి కోసం కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల అభివృద్ధి, విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.