గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: అదే గజేందర్
ADB: ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూర్ గ్రామ సర్పంచిగా గెలుపొందిన షేక్ షమీన్ భాను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్‌ను కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌ను గజేందర్ సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో గ్రామాల అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని సూచించారు.