ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
HYD: నగరంలో దారుణం చోటుచేసుకుంది. చిలకలగూడ పీఎస్ పరిధిలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జగదీశ్ అనే యువకుడు తన కుమార్తెను వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. యువతి శరీరంపై గాయాలు ఉన్నట్లు అనుమానం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.