దుబ్బ రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు

JGL: సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ శ్రీ దుబ్బరాజన్న స్వామి దేవస్థానంలో సోమవారం శ్రావణమాసంలో స్వామివారికి సమకూరిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీ ద్వారా రూ. 15,46,421 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వి.అనూష తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమొగిలి, దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పోరండ్ల శంకరయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.