యూరియా కొరతపై బీఆర్ఎస్ రాస్తారోకో

MHBD: కేసముద్రం పట్టణ కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు గుగులోతు వీరు నాయక్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. సరిపడా యూరియా సరఫరా అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని వీరు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.