టీచర్ కావాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే..!

టీచర్ కావాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే..!

కృష్ణా: డీ సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ.సుబ్బారావు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ నెల 15వ తేదీలోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. మెరిట్ ఆధారంగానే డైట్ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని, త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.