'వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి'

'వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి'

SRPT: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. బుధవారం నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంటును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాలేరు నుండి వస్తున్న నీటి సరఫరా తీరును పరిశీలించారు.