అరచేతిలో అంతర్జాలంతో జాగ్రత్త

అరచేతిలో అంతర్జాలంతో జాగ్రత్త

మెదక్: అరచేతి అంతర్జాలంతో జాగ్రత్తగా ఉండాలని సైబర్ బ్యూరో డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మెదక్ మహిళా డిగ్రీ కళాశాలలో సీఐ దిలీప్ కుమార్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సాధారణంగా ప్రజలు ఆశ, భయం వల్ల సైబర్ నేరాలకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ నేరాలు ఏమిటి, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలగురించి తెలియజేశారు.