జిల్లాలో భానుడి సెగ.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఎన్టీఆర్: జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకి రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల నుంచి రక్షణ కోసం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తీసుకోవాలని, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, సన్ స్క్రీన్, కళ్లద్దాలు వాడడం మంచిదన్నారు. అలాగే, పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లకూడదని పేర్కొన్నారు.