దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి: సీపీఎం

KRNL: వెల్దుర్తి మండలంలో 150 మంది దివ్యాంగుల పెన్షన్ తొలగించడానికి సీపీఎం జిల్లా నాయకుడు నగేష్ ఖండించారు. కర్నూలులో 5250, వెల్దుర్తిలో 150 దివ్యాంగుల పెన్షన్ తొలగించడం ద్వారా వారిపట్ల ప్రభుత్వ తీరు సరైనది కాదన్నారు. మండలంలో 80 శాతం అంగవైకల్యం ఉన్నా పెన్షన్ తొలగించారని వారు పేర్కొన్నారు. ఎంపీడీవోను అడగగా సదరం వెళ్లి సర్టిఫికెట్‌తో రావాలన్నారు.