జూలపల్లి చింతగట్టు గుట్ట పార్క్ ప్రారంభం
MBNR: మహమ్మదాబాద్ మండలం జూలపల్లి గ్రామ చింతగట్టు వెంకటేశ్వర స్వామి గుట్టను పార్క్‌గా అభివృద్ధి పనులు ప్రారంభించబడ్డాయి. గుట్ట చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం జారుడు బల్లలు, ఎంట్రెన్స్ గేట్, గజిబోలు నిర్మించనున్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, అటవీ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.