మహిళా ఉద్యోగుల అంకితభావం అభినందనీయం: కలెక్టర్

మహిళా ఉద్యోగుల అంకితభావం అభినందనీయం: కలెక్టర్

SRD: వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు అంకితభావంతో సేవలందిస్తున్నారని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో, కీలక పదవుల్లో రాణిస్తున్నారని.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.