PGRSలో 99 శాతం భూ సమస్యలే వస్తున్నాయి: MLA
PLD: ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో 99 శాతం భూ సమస్యలే వస్తున్నాయని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. బుధవారం గురజాలలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికను ఆయన నిర్వహించారు. అధికారులు గ్రామాలలో క్యాంపులు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామస్థాయిలో సభలు నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు.