ఎంపీ టికెట్ ప్రకటించడంతో సంబరాలు

కర్నూల్: కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును ప్రకటించడంతో పత్తికొండలో శుక్రవారం టీడీపీలోని కురువ సామాజిక వర్గానికి చెందిన వారు బాణాసంచా కాల్చి జై టీడీపీ అని నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీలోనే న్యాయం చేకూరుతుందని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పర్ల శ్రీనివాసులు, ఎరుకల చెరువు సురేంద్ర పేర్కొన్నారు.