వైభవంగా వారాహిమాత సామూహిక కుంకుమ పూజలు

VZM : గజపతినగరం మండలంలోని పురిటిపెంట పరిధిలోగల మల్లికార్జున స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల ప్రాంగణంలో గురువారం వారాహి మాత సామూహిక కుంకుమ పూజలను ఆలయ అర్చకులు మణికంఠ శాస్త్రి వైభవంగా నిర్వహించారు. వారాహి మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ పూజల్లో 110 మంది మహిళలు పాల్గొన్నారు.