'మాజీ సీఎం దృష్టికి మెడికల్ కాలేజీల సమస్య'

'మాజీ సీఎం దృష్టికి మెడికల్ కాలేజీల సమస్య'

SKLM: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టెక్కలి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు నక్కీట్ల నరేష్ గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన విద్య సమస్యలపై వివరించినట్లు ఆయన తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడంపై పేద వైద్య విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని మాజీ సీఎంకు వివరించినట్లు తెలియజేశారు.