యాసిడ్ లీక్.. ఊపిరాడక అల్లాడిన జనం

KRNL: జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఓ లారీ ట్యాంకరు నుంచి హైడ్రో క్లోరిక్ యాసిడ్ లీకైంది. గమనించిన డ్రైవర్ లారీని అక్కడే వదిలి పారిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దుర్వాసనతో విలవిల్లాడారు. అటుగా వేళ్లే వాహనాలన్నీ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.