VIDEO: నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చాలా ఇళ్లు పునాది, పిల్లర్లు, స్లాబ్ దశల్లోనే నిలిచిపోయాయి. ఆర్థికంగా బలహీనులైన లబ్ధిదారుల ఇళ్లు పూర్తికాకుండా ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు లబ్ధిదారులు సొంత ఖర్చులతో గదులు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు.