'భూగర్భ జలాలు తగ్గడం మంచిది కాదు'

BPT: భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం పర్యావరణానికి మంచిది కాదని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి శుక్రవారం అన్నారు. ప్రస్తుతం కృష్ణానది నుంచి కాల్వలన్నింటిలో నీరు విస్తృతంగా ప్రవహిస్తుందన్నారు. ఈ జలాలలో చెరువులను పూర్తిగా నింపాలన్నారు. ఏడాదిలోగా చెరువులు, పంట కాలువల కట్టలు బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.