బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

అన్నమయ్య: చిన్నమండెం మండలం మల్లూరు కస్పాలో వడదెబ్బతో మృతి చెందిన అబ్దుల్ రజాక్ కుటుంబాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సహాయం, పరిహారం త్వరగా అందిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.