మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌ను పరామర్శించిన వైవిఆర్
ATP: గుంతకల్లు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ భీమ లింగప్ప హైదరాబాదులో అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ భీమ లింగప్పను పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.