'డిజిటల్ అరెస్ట్ కాల్స్ ని ప్రజలెవరూ నమ్మొద్దు'
NRML: డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడొద్దని, ఆ కాల్స్ నమ్మొద్దని నిర్మల్ జిల్లా SP జానకీ షర్మిల ఓ ప్రకటనలో సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని, సైబర్ నెరగల్లు వీడియో కాల్, వాట్సప్ లేదా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత, బ్యాంక్, OTP, UPI, ఆధార్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.