మట్టి వినాయక విగ్రహాల తయారీపై పోటీలు

మట్టి వినాయక విగ్రహాల తయారీపై పోటీలు

TPT: తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 700 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా మట్టి వినాయకులను స్వచ్ఛంగా తయారు చేస్తూ తమ సృజనాత్మకతను చాటారు. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేసారు.